News15th Nov 04:40 PMSunil Byrisetty1 min read

నెల్లూరులో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలి

నెల్లూరులో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. హైదరాబాద్ లోని పీవీ నరసింహరావు

నెల్లూరులో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలి
నెల్లూరులో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. హైదరాబాద్ లోని పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వే తరహాలో అవసరమని పేర్కొన్నారు. పెన్నా నది నుంచి బుజబుజనెల్లూరు వరకు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో పాటు ప్రమాదాలకు చెక్ పడే అవకాశం ఉందని వివరించారు. నెల్లూరు – చెన్నైల మధ్య జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్పగుడి, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జీల (ఆర్.యూ.బీ) నిర్మాణాలు చేపట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంలో మౌలిక వసతుల బలోపేతానికి, రవాణా సదుపాయాల మెరుగుదలకు ఈ నిర్మాణాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Nellore
Expressway Project
Infrastructure Development
Somireddy Chandramohan Reddy
Nitin Gadkari
National Highways
రవాణా సదుపాయాలు
అభివృద్ధి
నెల్లూరులో ఎక్స్‌ప్రెస్‌వే
Scroll for the next article