Politics10th Mar 11:04 AMSunil Byrisetty1 min read
సోము వీర్రాజుకే బీజేపీ ఎమ్మెల్సీ
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీకి కేటాయించిన సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఖరారు చేసినట్లు సమాచారం. అసెంబ్లీ లాబీల
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీకి కేటాయించిన సీటు ఖరారైనట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్సీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఖరారు చేసినట్లు సమాచారం.
అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ విషయాన్నే స్పష్టం చేశారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఖరారు చేశామని చెప్పారు.
సోము వీర్రాజు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.
ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన 1, టీడీపీ 3 స్థానాలు తీసుకోగా బీజేపీకి ఒకటి దక్కింది.
బీజేపీలోనూ పలువురు ఆశావహులు ఉండగా సోము వీర్రాజుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అయితే మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా సోముకే ఖరారైంది.
త్వరలో బీజేపీ ఏపీ అధ్యక్ష పదవిని మార్చే సమయంలో అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.