National22nd Oct 04:27 PMSunil Byrisetty1 min read

ఇన్ స్టాలో సోనియా ఫస్ట్ పోస్ట్

ఇన్‌స్టాగ్రామ్ లో సోనియా గాంధీ అడుగుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ తొలి లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 10న విడ

ఇన్ స్టాలో సోనియా ఫస్ట్ పోస్ట్
ఇన్‌స్టాగ్రామ్ లో సోనియా గాంధీ అడుగుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ తొలి లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న ఈ పుస్తక పరిచయ వేడుకలో భాగంగా ఆమె ఈ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తన తొలి పోస్ట్‌లో ఈ ప్రత్యేక క్షణాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని సోనియా తెలిపారు. “హలో అందరికీ.. ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదే నా జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ తొలి లుక్” అని ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. “ఇది ప్రేమ, బాధ్యత, నష్టం , మనకంటూ ఒక చోటును వెతుక్కునే ప్రయాణానికి సంబంధించిన కథ. దీనిని మీతో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ తన బాల్య జీవితం నుండి ఇప్పటివరకు జరిగిన పలు ముఖ్యమైన ఘట్టాలను పంచుకున్నారు.
Scroll for the next article