News24th May 02:40 PMSunil Byrisetty1 min read
8 రోజుల ముందే రుతుపవనాలు.. కేరళను తాకిన 'నైరుతి'!
సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి చల్లని కబురు అందించాయి. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణం కంటే ఎ
సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి చల్లని కబురు అందించాయి.
దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి.
సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
మరో రెండు, మూడు రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశముంది.
వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి.
అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి.
2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి.
గతేడాది మే 30న రాగా.. 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది.