Telangana15th Dec 04:55 PMSunil Byrisetty1 min read
రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని కల్పించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాన్
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని కల్పించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు. 7.2 అడుగుల ఎత్తు ఉన్న బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో ఈరోజు సాయంత్రం 50 మందితో సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ గాయని, ఆయన సోదరి ఎస్పీ శైలజ స్పందించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని వెల్లడించారు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరిందని ఆమె అన్నారు.