Jobs24th Aug 11:46 AMSunil Byrisetty1 min read

కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులకు వెరిఫికేషన్ పిలుపు

అనంతపురం జిల్లాలో ఇటీవల నిర్వహించిన SCT కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై.. సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన స్త్రీ, పురుష అభ్యర్థులకు ఎస్పీ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 2

కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులకు వెరిఫికేషన్ పిలుపు
అనంతపురం జిల్లాలో ఇటీవల నిర్వహించిన SCT కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై.. సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన స్త్రీ, పురుష అభ్యర్థులకు ఎస్పీ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 25 వ తేదీ సోమవారం ఉదయం 08 గంటలకు అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో హాజరుకావాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు సెలెక్షన్స్ లో జిల్లా నుంచి సివిల్ విభాగం 278 మంది.. ఏపీఎస్పీ విభాగం 210 మందికి కానిస్టేబుళ్ల ఉద్యోగాలు సాధించడం విదితమేనన్నారు. ఈ అభ్యర్ధులందరూ సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషనుతో జతపర్చిన అన్ని ధృవ పత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, గెజిటెడ్ అధికారితో అటెస్టేషను చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, నాలుగు పాస్పోర్టు సైజ్ కలర్ ఫోటోలను వెంట తీసుకుని రావాలని తెలిపారు.
Andhra Pradesh Police
Anantapur
Police Recruitment
Constable Selection
APSP
Civil Constable
SP Jagadeesh
Certificate Verification
పోలీస్ నియామకాలు
కానిస్టేబుల్ ఎంపిక
ఏపీఎస్పీ
సివిల్ కానిస్టేబుల్
Scroll for the next article