Crime22nd Apr 12:59 PMSunil Byrisetty1 min read
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు పునర్విచారణ
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గత ప్రభుత్వంలో జరిగిన హత్య కేసు తెరపైకి వచ్చింద
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గత ప్రభుత్వంలో జరిగిన హత్య కేసు తెరపైకి వచ్చింది.
గత ప్రభుత్వంలో దళిత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
అప్పుడు చార్జీషీట్ లోపభూయిష్టంగా చేయడంతో అనంతబాబు బెయిల్‌పై బయటకొచ్చారు.
కూటమి ప్రభుత్వం ఆ కేసులో విచారణాధికారిగా ఐపీఎస్ మనీశ్ దేవరాజ్ పాటిల్‌ను నియమించి పునర్విచారణకు ఆదేశించింది.
విచారణ నివేదికను 60 రోజుల్లో ఎస్పీ, డీజీపీకి అందజేయాలని పేర్కొంది.