News16th Sep 04:24 PMSunil Byrisetty1 min read
మంత్రి సుభాష్ ను కలిసిన ఎస్పీ రాహుల్ మీనా
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీ రాహుల్ మీనా మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం అభిన
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీ రాహుల్ మీనా మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం అభినందనలు తెలియ జేసుకున్నారు. తొలుత ఎస్పీ రాహుల్ మీనా మంత్రికి పూల మొక్కను అందించగా ప్రతిస్పందనగా మంత్రి సుభాష్ ఎస్పీ ను దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శాంతి భద్రతలు, ఇతర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.