News20th Sep 11:05 AMSunil Byrisetty1 min read
పరిశుభ్రతే ప్రగతికి సోపానం
మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చ
మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ""స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర "" కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ స్టేడియం ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన షెల్కే నచికేత్ విశ్వనాథ్ మొక్కను నాటారు. ""స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర "లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. చెట్లు భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చెట్లు అనేక రకాల జంతువులు, పక్షులకు ఆవాసాలను అందించి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయన్నారు.