Technology29th Sep 06:14 PMSunil Byrisetty1 min read
స్పామ్ కు చెక్.. ట్రాయ్ కొత్త ఏఐతో స్పామర్లు బుక్!
అనవసరమైన కాల్స్‌తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్, ఆఫర్లు అంటూ పదేపదే ఫోన్ చేసే నంబర్లు విసిగిస్తుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి నంబర్లపై వినియోగద
అనవసరమైన కాల్స్‌తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్, ఆఫర్లు అంటూ పదేపదే ఫోన్ చేసే నంబర్లు విసిగిస్తుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి నంబర్లపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే ఎక్కువగా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇకపై వినియోగదారులు ఫిర్యాదు చేయకపోయినా.. ఏఐ టెక్నాలజీ ద్వారా స్పామ్‌గా గుర్తించిన నంబర్లపై టెలికాం కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. టెలికాం కంపెనీలు ఇప్పటికే ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లను గుర్తిస్తున్నాయి. ఆ టెక్నాలజీ ద్వారా ఒక నంబర్ స్పామ్ చేస్తున్నట్లు గుర్తిస్తే.. వినియోగదారుల ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా ఆ నంబర్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి చర్యలు తీసుకునేలా ట్రాయ్ నిబంధనలు మార్చింది. ఒకే వ్యక్తి లేదా సంస్థకు చెందిన గత 10 రోజుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు స్పామ్‌గా గుర్తిస్తే, ఆ పంపేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.