News12th Dec 01:00 PMSunil Byrisetty1 min read
చెత్త నుంచి సంపద' కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలి
నర్సీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 'చెత్త నుంచి సంపద' తయారీ కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. స్థానిక క్యాంప్ కా
నర్సీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 'చెత్త నుంచి సంపద' తయారీ కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు, ఆదాయాన్ని సమకూర్చే ఈ కేంద్రాల పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండలంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ కేంద్రాల నిర్వహణపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కేంద్రాల్లో చెత్త ద్వారా తయారైన వర్మీ కంపోస్టును స్థానిక రైతులకు విక్రయించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు, రైతులకు తక్కువ ధరకే సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.