News13th Nov 01:42 PMSunil Byrisetty1 min read

జాతీయ స్థాయికి ఎంపికైన బాక్సర్లని అభినందించిన స్పీకర్

ఆంధ్ర యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఇద్దరు బాక్సర్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందించారు. నర్సీపట్నంలోని స్పీకర్ క్

జాతీయ స్థాయికి ఎంపికైన బాక్సర్లని అభినందించిన స్పీకర్
ఆంధ్ర యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఇద్దరు బాక్సర్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందించారు. నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో వీరు స్పీకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. నర్సీపట్నం "నింజాస్ అకాడమీ"కి చెందిన ఈ క్రీడాకారిణులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బొంతు మౌనిక కళ్యాణం (75 కేజీల విభాగం), ABM డిగ్రీ కళాశాలకు చెందిన యేడిద లక్ష్మీ తేజస్విని (81 కేజీల విభాగం) ఇటీవలే అద్భుత ప్రతిభ కనబరిచారు. వచ్చే నెలలో పంజాబ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా స్పీకర్ వారిని అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సభ్యులు సుతాపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Andhra Pradesh
Ayyannapatrudu
Boxing
Andhra University
National Level Sports
Narsipatnam
Ninjas Academy
మహిళా క్రీడాకారిణులు
క్రీడా విజయాలు
ఏపీ శాసనసభ స్పీకర్
Scroll for the next article