News12th Jul 03:31 PMSunil Byrisetty1 min read

స్పీకర్ చొరవతో 'హెల్త్ క్లినిక్'లకు మహర్దశ!

నర్సీపట్నంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు శాసనసభ స్పీకర్ చొరవతో మహర్దశ పట్టింది. ప్రజల ఆరోగ్యానికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న స్పీకర్, సగం

స్పీకర్ చొరవతో 'హెల్త్ క్లినిక్'లకు మహర్దశ!
నర్సీపట్నంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు శాసనసభ స్పీకర్ చొరవతో మహర్దశ పట్టింది. ప్రజల ఆరోగ్యానికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న స్పీకర్, సగం పనులతో నిరుపయోగంగా పడి ఉన్న ఈ భవనాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో నిధులను మంజూరు చేయించారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఆగిపోయిన 22 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను పూర్తి చేయడానికి ఏకంగా రూ. 291.35 లక్షల నిధులను సాధించినట్లు తెలిపారు. స్పీకర్ కృషితో నర్సీపట్నం మండలంలోని 4 భవనాలకు రూ. 47.45 లక్షలు, నాతవరం మండలంలోని 7 భవనాలకు రూ. 88.30 లక్షలు, గొలుగొండ మండలంలోని 6 భవనాలకు రూ. 81.50 లక్షలు, మాకవరపాలెం మండలంలోని 5 భవనాలకు రూ. 74.10 లక్షలు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేయించడంతోనే సరిపెట్టకుండా, కేటాయించిన ఈ నిధులతో తక్షణమే పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు లేకుండా చూసుకుని, త్వరలోనే ఈ వైద్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని స్పీకర్ దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh Assembly Speaker
Narsipatnam
Village Health Clinics
Rural Healthcare
Public Health
Health Infrastructure
Natavaram
గొలుగొండ
మాకవరపాలెం
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article