News22nd Oct 04:02 PMSunil Byrisetty1 min read
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పంచారామాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కార్తీక మాసం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పంచారామాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పంచారామాల టూర్ ప్యాకేజీలో భాగంగా
అమరలింగేశ్వర స్వామి- అమరావతి, సోమేశ్వర స్వామి- భీమవరం, క్షీరారామలింగేశ్వర స్వామి- పాలకొల్లు, భీమేశ్వర స్వామి- ద్రాక్షారామం, కుమారరామ స్వామి, -సామర్లకోట పంచారామ క్షేత్రాలు ఉన్నాయన్నారు. ప్రతీ సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న టూరిజం కేంద్ర రిజర్వేషన్ కార్యాలయం నుంచి ఈ నెల 27, నవంబర్ 03,10,17 సోమవారం తేదీల్లో బస్సులు బయలుదేరతాయన్నారు. పెద్దలకు: రూ.2130/, పిల్లలు: రూ.1760 లు ధర ఉంటుందన్నారు. వీటితోపాటు ప్రతి శనివారం విజయవాడ నుంచి వాడపల్లి వరకు ప్రత్యేక బస్ ను పర్యాటక శాఖ నిర్వహిస్తోందన్నారు.. బుకింగ్‌ల కోసం www.tourism.ap.gov.in, ఇతర వివరాలకు 98480 07025, 84990 54422 & 1800 42545454 పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య ఆ ప్రకటనలో తెలియజేశారు.