News10th Jun 11:43 AMSunil Byrisetty1 min read

సీఎం కాన్వాయ్ దారిలో ప్రత్యేక కెమెరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు రాకపోకలు సాగించే సమయాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని తగ్

సీఎం కాన్వాయ్ దారిలో ప్రత్యేక కెమెరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు రాకపోకలు సాగించే సమయాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని తగ్గించేందుకు 'వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్' అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు సాగే మార్గంలో ఇరువైపులా 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇవి ఏఐ ఆధారంగా పనిచేయనున్నాయి. ఆ కెమెరాల ద్వారా ట్రాఫిక్ మూమెంట్ ను నిరంతరం పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకుంటారు.
Andhra Pradesh news
Cm Chandra Babu
CM Convoy
Special cameras
Movement Monitoring System
సీఎం కాన్వాయ్ దారిలో ప్రత్యేక కెమెరాలు
Scroll for the next article