News10th Jul 04:53 PMSunil Byrisetty1 min read
ఆర్ఎంపిల డిమాండ్ల పరిశీలనకు కమిటీ
కొంత కాలంగా ఆర్ఎంపిలు చేస్తున్న డిమాండ్ల పరిశీలకు కమిటీని వేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్ఎంపిలు, ఆశా వర్కర్లు, ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య స
కొంత కాలంగా ఆర్ఎంపిలు చేస్తున్న డిమాండ్ల పరిశీలకు కమిటీని వేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్ఎంపిలు, ఆశా వర్కర్లు, ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం డిమాండ్లు, సూచనలపై ఏపీ సచివాలయంలో మంత్రితో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్ భేటీ ఆయ్యారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఆర్ఎంపిలు తమకు వృత్తి రక్షణ, శిక్షణ అందించాలని కోరుతున్నారు. గతంలో కొంతమంది ఆర్ఎంపిలకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని వారు అడుతుతున్నారు. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌గా సేవలందించాల్సిన ఆర్ఎంపిలు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్లమని, డాక్టర్లమని చెప్పుకుంటూ ప్రాథమిక చికిత్సా కేంద్రాలుగా బోర్డులు పెట్టుకోవడంపై కొన్ని అభ్యంతారాలొచ్చాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వివరించారు. అలాగే ఆశా వర్కర్ల సమస్యలపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిండం పట్ల టిడి జనార్దన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల డిమాండ్లకు సంబంధించి ముఖ్యమంత్రి ఆమోదించిన కొన్ని విషయాలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని, ఆ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కృష్ణబాబుకు సూచించారు.