News1st Apr 03:00 PMSunil Byrisetty1 min read

ఏప్రిల్ 5న పాస్పోర్టుల జారీకి ప్రత్యేక డ్రైవ్

రాష్ట్రంలో పాస్పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజు

ఏప్రిల్ 5న పాస్పోర్టుల జారీకి ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో పాస్పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజుకు విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను విడుదల చేశారు. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే కాకుండా ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో 750 అదనపు అపాయింట్మెంట్లతో రెగ్యులర్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అలాగే అవసరమైతే స్లాట్లు, అపాయింట్మెంట్లు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.
special drive
passport
vijayawada
tirupati
Scroll for the next article