TTD30th Jul 11:18 AMSunil Byrisetty1 min read
ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి. 4న తిరుమల శ్రీవారి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.
4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం.
7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి.
8న ఆళ్వందార్ల వర్ష తిరు నక్షత్రం.
9న శ్రావణ పౌర్ణమి గరుడసేవ.
10న తిరుమల శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు.
16న గోకులాష్టమి ఆస్థానం.
17న తిరుమల శ్రీవారి సన్నిధిన శిక్యోత్సవం.
ఆగస్టు 25న బలరామ జయింతి, వరాహ జయంతి.
ఈ పర్వదినాలను తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు.