TTD29th Jun 12:04 PMSunil Byrisetty1 min read
జూలైలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 4, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో శ్రీ పద్మ
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 4, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో శ్రీ పద్మావతీ అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు. జూలై 12న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరిస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జూలై 3, 30 తేదీలలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారు సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 16న దక్షినాయన పుణ్యకాలం సందర్భంగా సా. 5 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరిస్తారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో.. 16న ఉత్తరభద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్నారు. శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో.. జూలై 21న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై విహరిస్తారని టీటీడీ తెలిపింది.