News11th Sep 05:45 PMSunil Byrisetty1 min read
దేశ వ్యాప్తంగా 17 నుంచి మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు 15 రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు జరగబోతున్నాయి. కేంద్ర ఆరోగ
మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు 15 రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు జరగబోతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు " స్వస్త్ నారీ-స్వషక్త్ పరివార్ అభియాన్ "నినాదంతో తో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక, పట్టణ, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలు జరుగనున్నాయి. ఈ వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్టు వైద్యులు మహిళలకు చికిత్స అందించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిబిరాలను ప్రారంభించనున్నారు. ఇదే సమయానికి ఇతర రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు ప్రారంభమవుతాయి. విశాఖలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలోని 10,032 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, 1,144 పీహెచ్సీలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.