News7th Oct 12:51 PMSunil Byrisetty1 min read

మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ ఆధ్వర్యంలో

మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనక దుర్గమ్మవారి ఆశీస్సులతో ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతోపాటు దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు లభించాలని కోరుతూ విశిష్టమైన ఖడ్గమాల అర్చన చేయించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రజ్రా ప్రస్థానం యాత్ర ప్రారంభమై 2014లో భారత ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ సేవలో నిరంతరం నిమగ్నమైన మోదీకి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని కోరుతూ పూజలు నిర్వహించారు.లింగమనేని రమేశ్ మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువకులు, ఉద్యోగులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు మోదీ గారి పాలనలో తగిన ప్రాధాన్యత లభిస్తుండడంతో సకల జనులు సంతృప్తిగా ఉన్నారన్నారు.
Scroll for the next article