Spiritual25th Jul 02:09 PMSunil Byrisetty1 min read

శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడిలో కుంకుమార్చన

శ్రావణమాసం తొలి శుక్రవారం రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణలో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారగోపురంలో ఉదయం నుంచి ప్రత్యేక కుంకుమార్చనలు ప

శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడిలో కుంకుమార్చన
శ్రావణమాసం తొలి శుక్రవారం రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణలో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారగోపురంలో ఉదయం నుంచి ప్రత్యేక కుంకుమార్చనలు పూజలు కొనసాగాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఒక గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము రూ.1,000లపై పూజకు ఇరువురు పాల్గొనవచ్చని సూచించారు. శ్రావణమాసంలో దుర్గా దేవిని పూజించడం వల్ల, కష్టాలు తొలగి, సిరిసంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని చెబుతున్నారు. సాంకేతికత వినియోగించుకుంటూ సిబ్బందికి కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ సూచనలు జారీ చేశారుశ్రావణ శుక్రవారం రోజున భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు.
Andhra Pradesh news
Kanaka Durga Temple
Sravana Friday
Kumkumarchana
Vijayawada
Durga Devi Puja
Ashtaiswarya
శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడిలో కుంకుమార్చన
Scroll for the next article