News19th Jan 11:39 AMSunil Byrisetty1 min read

అమరావతికి ప్రత్యేక చట్టాలు

రాజధాని అమరావతి నగరం పిపిపి దిశగా అడుగులు వేస్తోంది. స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా నిబంధనలు రూపొందిస్తున్నారు. పరిపాలనకు వీలుగా రూపొందించే నిబంధనలు ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌మె

అమరావతికి ప్రత్యేక చట్టాలు
రాజధాని అమరావతి నగరం పిపిపి దిశగా అడుగులు వేస్తోంది. స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా నిబంధనలు రూపొందిస్తున్నారు. పరిపాలనకు వీలుగా రూపొందించే నిబంధనలు ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు నియమించిన సంస్థలు లేదా వ్యక్తుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి చేశారు. మరో నెలరోజుల్లో విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి (మానిటైజ్‌) హక్కుల కల్పించే విధంగా మున్సిపల్‌ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. తొలిసారి ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో తయారవుతున్న చట్టాలుగా అమరావతి క్యాపిటల్‌సిటీ పరిపాలన నిబంధనలు నిలవనున్నాయి. దీనికోసం ప్రస్తుతం ఉన్న ఎపిసిఆర్‌డిఎ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. నిబంధనల రూపకల్పన కోసం ఢిల్లీ, ఛండీగడ్‌, నయా రాయపూర్‌, డొలేరా కార్పొరేషన్లు, పరిపాలన సంస్థలతోపాటు అంతర్జాతీయంగా సింగపూర్‌, బ్రెసీలియా, పుత్రజయ, సెజోంగ్‌, నసుంతారా, జోహోన్స్‌బర్గ్‌, ఆస్తానా నగరాల్లో పాలనా నిబంధనలు పరిశీలించాలని నిర్ణయించారు.
Andhra Pradesh
amaravati Capital
Special Laws
PPP Model
Capital City Governance
World Bank
Asian Development Bank
Municipal Law Reforms
మున్సిపల్ చట్టాల సవరణలు
ఏపీసీఆర్‌డీఏ చట్టం
పట్టణాభివృద్ధి
Scroll for the next article