Spiritual22nd Sep 10:06 AMSunil Byrisetty1 min read
దసరాలో దుర్గమ్మకు ప్రత్యేక మంగళసూత్రాలు!
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో కనకదుర్గమ్మను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి. దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో వీటిని అమ్మవారికి అలంకరిస్
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో కనకదుర్గమ్మను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి. దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో వీటిని అమ్మవారికి అలంకరిస్తారు. మూల విరాట్తో పాటు కల్యాణమూర్తులకు కూడా వీటితోనే అలంకరిస్తారు. సాధారణంగా బ్యాంకు లాకరులో భద్రపరిచే ఈ మంగళసూత్రాలను ఉత్సవాల్లో మాత్రమే బయటకు తీస్తారు. దసరా సందర్భంగా దుర్గమ్మ 11 రోజుల్లో 11 రూపాల్లో దర్శనమివ్వగా, ఒక్కో అలంకారానికి అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలు, మంగళసూత్రాలను అలంకరిస్తారు.