News3rd Dec 11:48 AMSunil Byrisetty1 min read
గుడివాడ బ్యూటీఫికేషన్ కు ప్రత్యేక చర్యలు
కూటమి ప్రభుత్వంలో గుడివాడలో మార్పు కనిపించేలా అభివృద్ధి పనులతో పాటుగా.. పట్టణ సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో జరుగుతున్న పట్టణ సుందరీ
కూటమి ప్రభుత్వంలో గుడివాడలో మార్పు కనిపించేలా అభివృద్ధి పనులతో పాటుగా.. పట్టణ సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో జరుగుతున్న పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము బుధవారం ఉదయం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. నిర్ణీత సమయానికల్లా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుడివాడ పట్టణ సుందరీకరణలో భాగంగా అనేక ప్రాంతాల్లో బ్యూటీఫికేషన్ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. పట్టణంలోని నెహ్రూ చౌక్, రాజ బాపయ్య చౌక్ తో పాటుగా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అశుభ్ర వాతావరణంతో ఉండే ఎజికే పాఠశాల వద్ద ఐ లవ్ గుడివాడ నేమ్ బోర్డు మరియు గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పోస్ట్ ఆఫీస్ రోడ్డులోని ప్రధాన డ్రైన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ డ్రైన్ మరమ్మతులతో భారీ వర్షాలు కురిసిన అవుట్ ఫ్లోకు ఇబ్బంది ఉండదన్నారు. పట్టణ సుందరీకరణకు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరు తమ సహకారం అందిస్తూ భాగస్వామ్యలు కావాలన్నారు.