Health30th Sep 05:49 PMSunil Byrisetty1 min read
వృద్ధులకు సర్కార్ వైద్యంతో భరోసా
రాష్ట్రంలోని వృద్ధులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వృద్ధులు ఆసుపత్రులకు వచ్చే వరకు వేచి చ
రాష్ట్రంలోని వృద్ధులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వృద్ధులు ఆసుపత్రులకు వచ్చే వరకు వేచి చూడకుండా వారి వద్దకే వెళ్లి వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, ఫిజియోథెరపీ, పునరావాస సేవలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంచామన్నారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ నెలంతా వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గురువారం పీహెచ్‌సీల్లో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు.