News29th Aug 12:35 PMSunil Byrisetty1 min read
విశాఖలో ఎన్ఐఏ కోర్టు
విశాఖలో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రత్యేక NIA కోర్టును కేంద్రం ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నం, జైపూర్, పాట్నాలో కొత్త ప్రత్యేక కోర్టులు ఏర్పాటవ
విశాఖలో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రత్యేక NIA కోర్టును కేంద్రం ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నం, జైపూర్, పాట్నాలో కొత్త ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతున్నాయి. NIA దర్యాప్తు చేసిన ఉగ్రవాద కేసులను ఈ కోర్టులు విచారిస్తాయి. ఉగ్రవాద కేసుల విచారణను వేగవంతం చేయడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. NIA చట్టం–2008లోని సెక్షన్ 11 ప్రకారం ప్రత్యేక కోర్టుల ఏర్పాటవుతున్నాయి.