TTD2nd Nov 05:19 PMSunil Byrisetty1 min read
టీటీడీ పాలకమండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో, నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన ప్రత్యేక అధి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో, నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది.
ప్రత్యేక అధికారుల కమిటీ వివరాలు:
ముద్దాడ రవిచంద్ర – తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో – కమిటీ ఛైర్మన్.
వి. వినయ్ చంద్ – ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ – సభ్యుడు.
కె. కన్నబాబు – ప్రభుత్వ కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ (FAC) – సభ్యుడు.
ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ TTD పాలకమండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతో పాటు, పాలకమండలి నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహిస్తుంది. పదవీకాలం: ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఒక సంవత్సరం పాటు లేదా నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటివరకు కొనసాగుతుంది.