News17th Jun 06:13 PMSunil Byrisetty1 min read
ఆలయాలకు అదనపు సొబగులు!
రాష్ట్రంలోని దేవాలయాల్లో మౌలిక వసతులు, భక్తుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సమాచారం సేకరించేందుకు, తనిఖీలు చేసేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టి
రాష్ట్రంలోని దేవాలయాల్లో మౌలిక వసతులు, భక్తుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సమాచారం సేకరించేందుకు, తనిఖీలు చేసేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో మౌలిక వసతులు, క్యూలైన్లు, అన్నప్రసాదాల నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలు పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో 22 దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించారు.
సింహాచలం దేవస్థానం, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, తలుపులమ్మ దేవస్థానం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ విధంగా ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.