Spiritual6th Nov 04:02 PMSunil Byrisetty1 min read
శ్రీ నూకాలమ్మ ఆలయంలో విశేష పూజలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న పట్టణ ఇలవేల్పు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం పురస్కరించుకుని విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న పట్టణ ఇలవేల్పు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం పురస్కరించుకుని విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు), ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు తో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలోఆలయ అభివృద్ది శరవేగంగా జరుగుతుంది. ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ నేతృత్వములో నిత్య పూజా కైంకర్యాలు పంచామృత అభిషేకాలు కర్పూర హారతితో కూడిన ఏకాదశ ఆరతి పూజలు మరియు సాయం సంధ్యా ఆరతి పూజలు చేశారు. అమ్మ వారికి పంచామృతాభిషేకలు, ప్రసాద వితరణకు ద్రవ్యం సమర్పించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి కార్తీక మాసోత్సవాల ఆహ్వాన పత్రికలు, శ్రీనూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక మహిళా సేవా బృందం సభ్యులు, గ్రామ భక్త మహాజనులకు ఆహ్వాన పత్రికలు వితరణ చేశారు.