Sports2nd Nov 01:55 PMSunil Byrisetty1 min read

ఇండియా గెలవాలని ప్రత్యేక పూజలు

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించాలని మంగళగిరి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయంలో

ఇండియా గెలవాలని ప్రత్యేక పూజలు
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించాలని మంగళగిరి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆశీస్సులతో టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో బాగా ఆడి గెలవాలని కోరుకున్నారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని, కొబ్బరి కాయలు కొట్టి స్వామి వారి తీర్థ ప్రసాదం అందుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీమ్ ఇండియా గెలవాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. భారత్ మహిళా జట్టుకు కోట్లాది మంది అభిమానులు ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎటు చూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
India Women Cricket
ODI World Cup
South Africa
Mumbai DY Patil Stadium
Special Prayers
Srilakshmi Narasimha Swamy Temple
టీమ్ ఇండియా
మహిళా క్రికెట్
భక్తిమయ మద్దతు
మంత్రి నారా లోకేష్
Scroll for the next article