News5th Sep 01:29 PMSunil Byrisetty1 min read
ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్స
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం నాలుగు అంచెల కార్యాచరణ అమలు జరుగుతోంది. 2026లో ఇప్పటి వరకూ నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, 1 ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో రూ.15.43 కోట్ల పరిహారం అందించినట్టు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ, రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి విజిలెన్స్ కమిటీల ఏర్పాటు చేశారు.