Spiritual2nd Nov 03:33 PMSunil Byrisetty1 min read
తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాల్లో విశేష ఉత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, పరిసర ఉపాలయాలు, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, పరిసర ఉపాలయాలు, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
నవంబరు 6, 13, 20, 27: ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారు తిరుచ్చిపై ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవంబరు 15: ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు అమ్మవారు గజ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. నవంబరు 24: కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.