Health12th Nov 05:09 PMSunil Byrisetty1 min read

70 ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

నవజాత శిశువులకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంచడం, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఎఫ్‌బీఎన్‌సీ (ఆసుపత్రి ఆధారిత నవజాత శిశు

70 ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
నవజాత శిశువులకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంచడం, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఎఫ్‌బీఎన్‌సీ (ఆసుపత్రి ఆధారిత నవజాత శిశు సంరక్షణ) పోర్టల్‌ వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో చినకాకాని హాయిలాండ్ హోటల్‌లో రెండు రోజుల పాటు పోర్టల్‌ వినియోగంపై ప్రత్యేక పునశ్చరణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను పోర్టల్‌లో ఖచ్చితంగా, సకాలంలో నమోదు చేయడం, సమాచార నమోదు, విశ్లేషణ, పర్యవేక్షణలో వైద్య సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం. బుధవారం నాటి శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్‌ మేనేజర్‌ (జాతీయ ఆరోగ్య మిషన్‌) డా. విజయలక్ష్మి కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవజాత శిశు సంరక్షణ సేవల బలోపేతంలో ఎఫ్‌బీఎన్‌సీ పోర్టల్‌ ప్రాధాన్యాన్ని వివరించారు. జాయింట్‌ డైరెక్టర్‌ (శిశు ఆరోగ్యం) డా. సుబ్రహ్మణ్యం ముఖ్యోపన్యాసం చేస్తూ.. శిశువుల ఆరోగ్య వివరాలను సమగ్రంగా సేకరించడం, విశ్లేషించడం, వైద్య సేవలను పర్యవేక్షించడం ద్వారా సంరక్షణ నాణ్యతను మెరుగుపరచవచ్చని తెలిపారు.
Scroll for the next article