Education3rd Jan 12:33 PMSunil Byrisetty1 min read
వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ
వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. అమెరికాకు చెందిన "క్వశ్చన్, పర్స్యూవేడ్ రిఫర్ ఇన్స్టిట్యూట్ ఇండియా (క్యూ
వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. అమెరికాకు చెందిన "క్వశ్చన్, పర్స్యూవేడ్ రిఫర్ ఇన్స్టిట్యూట్ ఇండియా (క్యూపీఆర్ ఐ) సంస్థతో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒప్పందాన్ని చేసుకుంది. ఎంబీబీఎస్ లో ప్రథమ సంవత్సరం (2025-26)లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపొందింపచేసేందుకు, ఒత్తిడిని పారదోలేందుకు, ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేలా కళాశాలల వారీగా ఎంపికచేసిన తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్య విద్యార్థుల విషయంలో ఒప్పందం జరగడం దేశంలోనే తొలిసారి అని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు 2025-26 నుంచి ఐదేళ్లపాటు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే శిక్షణ నిమిత్తం అయ్యే వ్యయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ భరిస్తుందని చెప్పారు.