Education16th Nov 05:28 PMSunil Byrisetty1 min read

17 నుంచి వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు

నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఈనెల 17 నుంచి జరగనున్నాయి. హెచ్ఐవీ వచ్చిన వా

17 నుంచి వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు
నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఈనెల 17 నుంచి జరగనున్నాయి. హెచ్ఐవీ వచ్చిన వారికి మాత్రమే కాకుండా సుఖవ్యాధులు ఉన్న వారి నుంచి ఇతరులకు హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉంది. ప్రాథమిక దశలోనే ఈ తరహా కేసులను గుర్తించి అవసరమైన చికిత్స ఇచ్చేందుకు మండలాల స్థాయిలో ఉండే వైద్యులకు శిక్షణ ఇప్పించాలని న్యాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇందులో భాగంగా పీహెచ్సి, అర్బన్ పీహెచ్సీల్లో పనిచేసే వైద్యుల్లో ఎంపికచేసిన సుమారు 325 మందికి ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు విజయవాడ కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు కార్యాలయం తెలిపింది.
Andhra Pradesh
Vijayawada
Medical Training
Doctors Training
HIV Awareness
STD Control
NACO
PHC
Urban PHC
AIDS Control Society
Scroll for the next article