News7th Jun 05:02 PMSunil Byrisetty1 min read

బుడ‌మేరు ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి

గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని, వ‌ర్షాకాలం నేప‌థ్యంలో బుడ‌మేరు వ‌ర‌ద శాశ్వ‌త నివార‌ణకు సంబంధించి చేప‌ట్టిన ఫ్ల‌డ్ డ్యామేజ్ రెస్టోరేష‌న్ (ఎఫ్‌డీఆర్), ఇత‌ర ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతి

బుడ‌మేరు ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి
గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని, వ‌ర్షాకాలం నేప‌థ్యంలో బుడ‌మేరు వ‌ర‌ద శాశ్వ‌త నివార‌ణకు సంబంధించి చేప‌ట్టిన ఫ్ల‌డ్ డ్యామేజ్ రెస్టోరేష‌న్ (ఎఫ్‌డీఆర్), ఇత‌ర ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్త‌య్యేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండ‌లం వెల‌గ‌లేరు వ‌ద్ద రెగ్యులేట‌రీ, బుడ‌మేరు దానికి సంబంధించిన పులివాగు, బుడ‌మేరు డైవ‌ర్ష‌న్ ఛాన‌ల్ ప్రాంతంలో అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌ర్య‌టించారు. ఇప్ప‌టికే చేపట్టిన ప‌నులు, వాటిలో పురోగ‌తి, ఇంకా అవ‌స‌ర‌మైన స‌మ‌యంతో పాటు క్యాచ్ మెంట్ ఏరియా, గండ్లు ప‌డిన ప్రాంతాలు త‌దిత‌రాల‌కు సంబంధించి మ్యాపుల‌ను ప‌రిశీలించి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సూచించారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారంగా ఏజెన్సీ ద్వారా చేప‌ట్టిన ప‌నుల‌ను ప‌రిశీలించి, వీలైనంత త్వ‌ర‌గా పూర్త‌య్యేలా చూడాల‌ని ఆదేశాలిచ్చారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వ‌రిత‌గతిన పూర్త‌య్యేలా అద‌న‌పు మెషిన‌రీ, సిబ్బందిని స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. రోజువారీ వ‌ర్క్ షెడ్యూల్ ప్ర‌కారం ప‌నుల పూర్తికి కృషిచేయాల‌ని, నిరంత‌రం ప‌నుల ప‌రోగ‌తిని స‌మీక్షించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఇరిగేష‌న్ అధికారుల‌ను ఆదేశించారు.
Andhra Pradesh news
Vijayawada
budameru retaining wall
Collector Lakshmisha
రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగ‌వంతం
Scroll for the next article