Health9th Sep 01:11 PMSunil Byrisetty1 min read

పక్షవాతానికి పాలకూర మందు!

పక్షవాతం వచ్చే రిస్క్ ను నివారించే విషయంలో పాలకూర సమర్ధవంతంగా పనిచేస్తుందని చైనీస్ శాస్త్రవేత్తలు నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జరుగుతుందని శాస్త్రజ్ఞులు తె

పక్షవాతానికి పాలకూర మందు!
పక్షవాతం వచ్చే రిస్క్ ను నివారించే విషయంలో పాలకూర సమర్ధవంతంగా పనిచేస్తుందని చైనీస్ శాస్త్రవేత్తలు నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జరుగుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. మరీ ముఖ్యంగా హైపర్ టెన్షన్స్ వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలం గా ఉంటుందని వారు పేర్కొన్నారు. హైబీపి ఉన్న 20702 మంది ఫై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వీరికి మందులతో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని అందించారు. అయితే క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ ను తీసుకుంటున్న వారిలో స్ట్రోక్ వచ్చేందుకు రిస్క్ 21 శాతం పడిపోయాయని గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలను ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్ ' అనే మెడికల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
Health
Spinach Benefits
Stroke Prevention
Folic Acid
Hypertension
Chinese Scientists Study
Medical Research
Stroke Risk Reduction
Healthy Diet
Leafy Greens
Journal of the American Medical Association
Spinach Nutrition
Scroll for the next article