News24th Jun 12:50 PMSunil Byrisetty1 min read

ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

ఆర్చరీలో అద్భుతాలు సాధించిన క్రీడాకారులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అభినందించింది. సింగపూర్లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధ

ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన
ఆర్చరీలో అద్భుతాలు సాధించిన క్రీడాకారులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అభినందించింది. సింగపూర్లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, ఇండివిడ్యువల్, మిక్సిడ్, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ఆర్చరీలో వారు సాధించిన పతకాలు, విజయాలు గురించి వివరించారు. సందర్భంగా వారిని శాప్ ఛైర్మన్ అభినందించడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Sports
athletes
silver medal
B. Shanmukhi Nagasai
Shap Chairman congratulated
వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ
Scroll for the next article