News23rd May 04:30 PMSunil Byrisetty1 min read
ఇబ్రహీంపట్నం మండలంలో స్పోర్ట్స్ సిటీ
ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సేకరించనున్న భూములకు సంబంధించిన రైతులతో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజ
ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సేకరించనున్న భూములకు సంబంధించిన రైతులతో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశ , సిఆర్డిఏ అధికారులతో కలిసి రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం అమరావతిలో భాగమైందన్నారు.
ఇక్కడ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటయితే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పలు గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి, మూలపాడు, కేతనకొండ గ్రామాల్లో ఇప్పటికే అధికారులు గ్రామసభలు నిర్వహించగా, ఈ గ్రామసభలలో ఎక్కువ మంది స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారన్నారు.
ఆ మేరకు గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారన్నారు.
ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించడం వల్ల రైతులకు ఎటువంటి నష్టం ఉండదన్నారు.
పైగా పలువురు రైతులు మాట్లాడుతూ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.