Sports20th Jun 10:51 AMSunil Byrisetty1 min read
క్రీడా పాఠశాల ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు
కడపలోని డా. వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంచుతూ సంస్థ ప్రకటించింది. 4, 5వ తరగతుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల తేదీని
కడపలోని డా. వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంచుతూ సంస్థ ప్రకటించింది. 4, 5వ తరగతుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల తేదీని ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పొడిగించామని శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పొడిగించిన తేదీని గమనించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ కోసం క్రీడా శాఖ వెబ్సైట్ https://apysrsportsschool.in/ చూడవచ్చని సూచించారు. అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.