News10th May 12:21 PMSunil Byrisetty1 min read

అవుకు ఆలయంలో మంత్రి దంపతులు!

బనగానపల్లె నియోజకవర్గం అవుకు గ్రామంలో పురాతన శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన

అవుకు ఆలయంలో మంత్రి దంపతులు!
బనగానపల్లె నియోజకవర్గం అవుకు గ్రామంలో పురాతన శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - బీసీ ఇందిరమ్మ దంపతులు పాల్గొన్నారు. అవుకు గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు.
Minister BC Janardhan Reddy
Avuku village
Banaganapalle constituency
Thirukalyana Mahotsava
శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బీసీ ఇందిరమ్మ దంపతులు
Scroll for the next article