Spiritual11th Oct 04:24 PMSunil Byrisetty1 min read

వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్

వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా శరన్నవరాత్రుల తొలి రోజైన నేడు అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. తొలి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఉండవల్లి సెంటర్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నవరాత్రుల రోజుల్లో ప్రతిరోజూ వివిధ రకాల పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
Scroll for the next article