News15th Mar 09:35 AMSunil Byrisetty1 min read
జ్యోతి క్షేత్రానికి మార్గం సుగమం
గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తూ ఆకలి తీరుస్తున్న కడప జిల్లా బద్వేలు మండలం కాశి నాయన జ్యోతి క్షేత్రం కు సంబంధించిన అనుమతి విషయంలో 13 మార్చి గురు
గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తూ ఆకలి తీరుస్తున్న కడప జిల్లా బద్వేలు మండలం కాశి నాయన జ్యోతి క్షేత్రం కు సంబంధించిన అనుమతి విషయంలో 13 మార్చి గురువారం నాడు విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి అధ్యక్షతన కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కలిసి కాశినాయన క్షేత్రం విశిష్టతను తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించి కోరిన విధంగా అనుమతులు ఇవ్వడానికి అంగీకరించారు.
కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి, శశి భూషణ్ రెడ్డి, సింగారెడ్డి, కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కొరకు విశేషమైన కృషి చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు