Spiritual18th Oct 03:39 PMSunil Byrisetty1 min read
ఘనంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి గ్రామోత్సవం
గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని ప్రసిద్ధ శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవ ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా
గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని ప్రసిద్ధ శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవ ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసిన వాహన రథానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ వాహనాన్ని నడుపుతూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. అమ్మవారి గ్రామోత్సవం భక్తజన సందోహం మధ్య కన్నుల పండువగా సాగింది.