Spiritual1st Nov 04:04 PMSunil Byrisetty1 min read

ప్రొద్దుటూరులో బయల్పడిన శ్రీ కృష్ణదేవరాయ శిలా శాసనం !

ప్రొద్దుటూరు పట్టణం సినీ హబ్ వెనక ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలా శాసనం ఒకటి బయలు పడిందని భారత పురావస్తు పరిశోధన శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి శనివారం తెలిపా

ప్రొద్దుటూరులో బయల్పడిన శ్రీ కృష్ణదేవరాయ శిలా శాసనం !
ప్రొద్దుటూరు పట్టణం సినీ హబ్ వెనక ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలా శాసనం ఒకటి బయలు పడిందని భారత పురావస్తు పరిశోధన శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి శనివారం తెలిపారు. కొత్తగా నిర్మించే ఇంటి కోసం ప్రొద్దుటూరుకు చెందిన వెన్నపూస భరత్ రెడ్డి సూపర్వైజర్ గా పని చేస్తుండడంతో ఈ శాసనం గురించి మునిరత్నం రెడ్డికి చెప్పారు. క్రీస్తు శకం 1523 జనవరి 24 శనివారం ఈ శిలా శాసనం వేయించారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవి పుణ్యం కోసం కావులూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం ప్రాకారo, కోడి (ఆలయ శిఖరం) కట్టించారని వివరించారు. కావులూరు ప్రాంతంలోని తిప్పారెడ్డిపల్లి, గ్రామనపల్లి రెండు గ్రామాలకు నుంచి వచ్చే దొమ్మరి పన్నును దొమ్మరి రామచంద్రుడు తిరుమల రాయని కుమారుడు రాజులయ్య చెన్నకేశవ స్వామి కి ఇచ్చారని తెలిపారు. అలాగే 24 దొమ్మరి కులాల పుణ్యo కోసం అమృతపల్ల దశమి పుణ్యకాలమందు సేవలందించేందుకు చెన్నకేశవదేవునికి 15 రూకలను రాజులయ్య బహుకరించినట్లు నమోదు చేయబడిందని డైరెక్టర్ వెల్లడించారు .
Andhra Pradesh
Proddatur
Sri Krishnadevaraya
Archaeological Discovery
Stone Inscription
Indian Archaeology
విజయనగర సామ్రాజ్యం
చెన్నకేశవ స్వామి ఆలయం
చారిత్రక కనుగొనిక
సాంస్కృతిక వారసత్వం
Scroll for the next article