Spiritual12th Aug 01:27 PMSunil Byrisetty1 min read
శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు
గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన మండపంలో సంకటహర చతుర్దశి పర్వదిన వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్ష్మీ
గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన మండపంలో సంకటహర చతుర్దశి పర్వదిన వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమ పూజల్లో 137మంది దంపతుల జంటలు.. భక్తులు పాల్గొని పూజలు చేశారు. వేద పండితులు పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం.. హోమగుండంలో పూర్ణాహుతిని సమర్పించారు.లోక కళ్యాణార్థమే దేవస్థానంలో సంకటహర చవితి రోజున శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు, చైర్మన్ సాయన రాజేష్ తెలిపారు తెలియజేశారు. ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు దేవాలయంలో శ్రీ గణపతి నవరాత్ర మహోత్సవాలు ఆధ్యాత్మిక, పూజ, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.