News17th Aug 04:42 PMSunil Byrisetty1 min read
గుంటూరు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక
గుంటూరు నుంచి ఎగుమతైన మిర్చిని శ్రీలంక తిరస్కరించింది. అఫ్లోటాక్సిన్, అధిక తేమ శాతం ఉందంటూ పదుల సంఖ్యలో మిర్చి కంటైనర్లను రిజెక్ట్ చేసింది. తేమ ఎక్కువై ఫంగస్ ఏర్పడడంతో మిర్చి నాణ్య
గుంటూరు నుంచి ఎగుమతైన మిర్చిని శ్రీలంక తిరస్కరించింది. అఫ్లోటాక్సిన్, అధిక తేమ శాతం ఉందంటూ పదుల సంఖ్యలో మిర్చి కంటైనర్లను రిజెక్ట్ చేసింది. తేమ ఎక్కువై ఫంగస్ ఏర్పడడంతో మిర్చి నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తించామని పేర్కొంది. మిర్చిని వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతి వ్యాపారులకు శ్రీలంక అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్రీలంక అధికారులతో మిర్చి ఎక్స్‌పోర్టర్స్ చర్చలు జరుపుతున్నారు. రెండు నెలల క్రితం గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని చైనా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల మిర్చి నాణ్యత నిబంధనలను శ్రీలంక కఠినంగా అమలు చేస్తోంది.