Spiritual17th Jan 01:27 PMSunil Byrisetty1 min read

చంద్రగిరిలో వైభవంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి మహోత్సవాలు

చంద్రగిరి పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 'కొండచుట్ట

చంద్రగిరిలో వైభవంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి మహోత్సవాలు
చంద్రగిరి పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 'కొండచుట్టు మహోత్సవం' భక్తుల కోలాహలం నడుమ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాల ఊరేగింపు స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయం నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని (వెంకటమణి ప్రసాద్), వారి సతీమణి పులివర్తి సుధారెడ్డి దంపతులు తొలుత కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు శేష వస్త్రంతో తలపాగా చుట్టి, అమ్మవారి పట్టువస్త్రాలను అందజేశారు. అక్కడి నుండి మంగళవాయిద్యాలు, మేళతాళాలు, మరియు మహిళల కోలాటాల నడుమ పట్టువస్త్రాలను తలపై ధరించి ఎమ్మెల్యే దంపతులు ఊరేగింపుగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. దారిపొడవునా భక్తులు అమ్మవారికి, ఎమ్మెల్యే దంపతులకు ఘనస్వాగతం పలికారు.
Chandragiri
Sri Mulasthana Ellamma Temple
Sankranti Mahotsavams
Brahmotsavams
Kondachuttu Mahotsavam
TTD
టీటీడీ
పట్టువస్త్రాల సమర్పణ
పులివర్తి నాని
భక్తులు
ధార్మిక వేడుకలు
Scroll for the next article