Spiritual26th Sep 04:49 PMSunil Byrisetty1 min read

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అమ్మవారి పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చి

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అమ్మవారి పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చివరి రోజైన శనివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారగా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Scroll for the next article